బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆదిత్యలో వర్క్ షాప్

UPDATED 22nd FEBRUARY 2018 THURSDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ హాకథాన్ సిరీస్ 2 అనే అంశంపై ఎపిఐటిఎ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ రెండురోజులు పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన ఎపిఐటిఎ సంస్థకు చెందిన ప్రశాంత్ విశ్వనాధ్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారని, వంద మంది విద్యార్థులకు కోడింగ్ స్కిల్స్, ప్రోబ్లం ఐడెంటిఫికేషన్ ప్రోబ్లం సాల్వింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులు వచ్చే నెలలో విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ డవలప్ మెంట్ మేనేజర్ ఎం. వంశీ (వైజాగ్), కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్.టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఎ. రామకృష్ణ, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ టి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us