తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం

UPDATED 3rd FEBRUARY 2026 8:00 PM

ఆధునిక సాంకేతికతతో పద్య సౌరభం

సాహిత్య డిజిటల్ వేదికను రూపొందించిన ప్రోగ్రాం మేనేజర్ సందీప్ మిరియాల

రెడ్ బీ న్యూస్ ప్రతినిధి: తెలుగు సాహితీ సంపదను భావితరాలకు చేరువ చేసే లక్ష్యంతో, అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతను జోడించి ‘రత్నాలబాల’ (Rathnalabala) అనే సమగ్ర సాహిత్య డిజిటల్ వేదికను రూపకల్పన చేశారు ప్రోగ్రాం మేనేజర్ సందీప్ మిరియాల (Sandeep Miriyala). ఆయన  రూపొందిన ఈ ప్రాజెక్ట్, సాంప్రదాయ పద్య సాహిత్యానికి డిజిటల్ సొబగులు అద్దుతోంది. సాహిత్యం – సాంకేతికత కలయిక ‘రత్నాలబాల’ కేవలం ఒక వెబ్‌సైట్ మాత్రమే కాదు, ఇది పద్యాలవాల, భావాలమాల, శతకాలమాల, చిత్రమాల, కథామాల, సామెతలమాల, లిపిమాల వంటి వైవిధ్యభరితమైన మాడ్యూల్స్ కలబోత అని పేర్కొన్నారు. సాహిత్యాన్ని కేవలం చదవడమే కాకుండా వినడం, రాయడం, చిత్రించడం, నేర్చుకోవడం, భద్రపరుచుకోవడం వంటి ఎనిమిది రకాల అనుభూతులను ఈ వేదిక ద్వారా పొందవచ్చని తెలిపారు.

ప్రత్యేకతలు ఇవే..

AI పద్య వాచనం (Text-to-Speech): పద్యాలను స్పష్టమైన ఉచ్చారణతో AI స్వరంతో వినిపించే సౌకర్యం ఉంది. ఇది పిల్లలకు, వృద్ధులకు, దృష్టి లోపం ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

చిత్రమాల - పద్య యంత్రం..

రాసిన పద్యాన్ని తక్షణమే అందమైన పోస్టర్‌గా మార్చుకునే వెసులుబాటు ఇందులో ఉందని, అలాగే 50కి పైగా ఆకర్షణీయమైన తెలుగు యూనికోడ్ ఫాంట్లు (Telugu Unicode Fonts) అందుబాటులో ఉన్నాయన్నారు.

లిపిమాల (Telugu OCR)..

పాత పుస్తకాలు లేదా చిత్రాల్లోని తెలుగు అక్షరాలను డిజిటల్ పాఠం గా (Text) మార్చే అద్భుత సాధనం. ఇది పరిశోధకులకు, రచయితలకు వరం.

శతకాలమాల & కథామాల.. 

వందలాది శతక పద్యాలు, పిల్లల కోసం నీతి కథలు ఒకే చోట లభిస్తాయి.

AI ఆధారిత అన్వేషణ..

భావం లేదా పదం ఆధారంగా సంబంధిత పద్యాలను వెతికే స్మార్ట్ సెర్చ్ సిస్టమ్ (Smart Search System) ఇందులో ఉంది.

గోప్యతకు పెద్దపీట..

వాడుకరుల (Users) వ్యక్తిగత డేటా లేదా వారు సృష్టించే చిత్రాలు, పద్యాలు సర్వర్లలో నిల్వ చేయబడవు. డేటా అంతా వాడుకరి డివైస్‌లోనే భద్రంగా ఉండేలా 'ప్రైవసీ'కి అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు రూపకర్త సందీప్ తెలిపారు. అలాగే తెలుగు భాషను డిజిటల్ ప్రపంచంలో సుసంపన్నం చేస్తున్న 'ఫ్రీ తెలుగు ఫాంట్స్' (freetelugufonts.com) నిర్వాహకులు అప్పాజీ అంబరీష్ దర్భా (Appaji Ambarish Dharbha) సహకారాన్ని ఈ సందర్భంగా రత్నాలబాల బృందం కొనియాడింది. తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు, సాహితీ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ratnalabala.vercel.appను సందర్శించాలని ఆయన కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us