PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం

UPDATED 23rd FEBRUARY 2026 8:30 PM

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 23 : పెద్దాపురం మండలం కట్టమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నూతన చైర్ పర్సన్ గా సానిపిన శ్రీదేవి, డైరెక్టర్లుగా నున్న సత్యనారాయణమూర్తి, గంగుమళ్ళ శ్రీనివాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో  జరిగిన ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి పదవీ ప్రమాణం చేయించారు. ​పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్ పర్సన్ సానిపిన శ్రీదేవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రైతులకు, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ​అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో సాగు రుణాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సంఘం కార్యకలాపాలలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పీఏసీఎస్ ను మోడల్ సహకార సంఘంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని, అలాగే పీఏసీఎస్ సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ, రైతులకు భరోసా ఇచ్చే కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ

ఈ పదవి అధికారం కాదని, రైతన్నలకు సేవ చేసే గొప్ప అవకాశమని అన్నారు. ​క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గడువులోగా సాగు రుణాలు, రాయితీలను అందించాలని స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక పురోభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని, నూతన పాలకవర్గం రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని కోరారు. పాలకవర్గం నాయకత్వంలో ఈ సహకార సంఘం ఆదర్శవంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల అవసరాలను గుర్తించి, స్పందించే గుణం ఉన్న వ్యక్తికి బాధ్యతలు దక్కడం శుభపరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  కట్టమూరు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు బిక్కిన శ్రీరామ్ ప్రసాద్, గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఏఎంసీ డైరెక్టర్ గుత్తుల సూర్యావతి శ్రీనివాస్, కూటమి నాయకులు సానిపిన రామకృష్ణ, నూనే రామారావు, కట్టమూరు నీటి సంఘం అధ్యక్షుడు మాదిరెడ్డి రామకృష్ణ, శ్రీ కేశవ పట్టాభిరామ స్వామి దేవస్థానం చైర్మన్ దూళ్ళ నాగేంద్ర, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అడపా శివ, అడపా గంగాధర్, మాదిరెడ్డి దత్త కుమార్, చెన్నం వెంకన్న బాబు, పీఏసీఎస్ సీఈవో శానపల్లి నాగభూషణం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us