కోవిడ్-19 నియంత్రణకు ప్రత్యేకాధికారులు నియామకం

UPDATED 18th JULY 2020 SATURDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): రోజురోజుకు విజృంభిస్తున్న కోవిడ్-19 పాజిటీవ్ కేసులను నియంత్రించేందుకు ఈనెల 16వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్న అదనపు నియంత్రణ చర్యలలో భాగంగా కేసులు అధికంగా నమోదవుతున్న మండలాల్లో వైరస్ కట్టడి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డి. మురళీధర రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కాకినాడ డివిజన్ పరిధిలో మున్సిపల్ కమీషనర్, కాకినాడ కార్పోరేషన్ (కాకినాడ అర్బన్), ఆర్డీవో, కాకినాడ (కాకినాడ రూరల్), ఈడి, బీసీ కార్పోరేషన్  (సామర్లకోట), డిడి, పశుసంవర్ధకశాఖ, కాకినాడ (యు.కొత్తపల్లి), ఎస్డీసీ, ఏపిజిడిసి, కాకినాడ (పిఠాపురం), రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో మున్సిపల్ కమీషనర్, రాజమహేంద్రవరం కార్పోరేషన్ (రాజమహేంద్రవరం అర్బన్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హౌసింగ్, కాకినాడ (రాజమహేంద్రవరం రూరల్), అమలాపురం డివిజన్ పరిధిలో జెడీ, సాంఘిక సంక్షేమశాఖ (అమలాపురం), డివిజనల్ కోఆపరేటీవ్ అధికారి, అమలాపురం (ఐనవిల్లి), పెద్దాపురం డివిజన్ పరిధిలో ఆర్డీవో, పెద్దాపురం (పెద్దాపురం), రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఆర్డీవో, రామచంద్రపురం (మండపేట), డిడి, జిల్లా పరిశ్రమల కేంద్రం, కాకినాడ (రాయవరం) లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. తమకు కేటాయించిన మండలాల్లో రెవెన్యూ, పోలీస్, మెడికల్, మున్సిపల్, పంచాయితీరాజ్, ఇతర శాఖల సమన్వయంతో కోవిడ్-19 నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేకాధికారులను ఆదేశించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us