UPDATED 24th FEBRUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక సంపెంగతోటలో గల జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర సామర్లకోట పట్టణంలో గల రిక్షా కార్మికులకు ఆదివారం వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ, భారత్ మాతా సేవా పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గద్దే వీర వెంకట సత్యనారాయణ, యార్లగడ్డ రాజు, గుత్తికొండ నవీన్, కాటంరెడ్డి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.







