UPDATED 27th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ప్రస్తుతం చెల్లిస్తున్న ట్రేడ్ మార్జిన్ సరిపోవడం లేదని, ట్రేడ్ మార్జిన్ శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐఎంఎల్ డిపో వద్ద మద్యం వ్యాపారులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రేడ్ మార్జిన్ ను పెంపుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నేటి వరకు అమలు చేయకపోవడం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లేందుకు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు నిరవధిక బంద్ కు పిలుపు ఇచ్చినందున అన్ని మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లు మూసివేస్తామని తెలిపారు.







