UPDATED 29th DECEMBER 2017 FRIDAY 7:00 PM
రంగంపేట: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్.ఎస్.ఎస్ విభాగం రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ. రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఇంటింటి సర్వే నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్ల సమాచారం సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేశారన్నారు. ఈ సమాచారం ప్రకారం గ్రామంలో ఎక్కువ శాతం దళితవాడల్లో మరుగుదొడ్లు లేనట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ జె. బాలమోహన్ రాజు, ఎం.సోమిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఆచంట.సత్యనారాయణ, ఉపసర్పంచ్ ముత్యం వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.







