ఫిల్మ్‌నగర్‌ వినాయకుడికి 500కిలోల లడ్డూ సమర్పించిన సురుచి ఫుడ్స్

UPDATED 26th AUGUST 2017 SATURDAY 7:00 PM

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని ప్రసిద్ధ సురుచి ఫుడ్స్‌ సంస్థ ప్రత్యేకంగా తయారుచేసిన 500కిలోల లడ్డూను స్థానిక ఫిల్మ్‌నగర్‌లోని వినాయకుడికి ప్రముఖ సినీనటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లడ్డూను సమర్పించిన సురుచి ఫుడ్స్‌ యాజమాన్యానికి స్వామివారి దీవెనలు కలగాలని ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us