శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ అందజేత

UPDATED 21st MARCH 2018 WEDNESDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో మూడు రోజుల పాటు జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసినట్లు విస్తరణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఆర్. వెంకట్రావు, ఫ్యాకల్టీలు ఎ. గోపాలరావు, అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ మొహిద్దీన్, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us