సాంప్రదాయ కళలపై అవగాహన పెంచుకోవాలి

UPDATED 12th JANUARY 2019 SATURDAY 6:00 PM

గండేపల్లి: సాంప్రదాయ కళలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో శనివారం రంగోలీ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు సాంప్రదాయ కళలపై అవగాహన పెంచుకుని వాటిలో నైపుణ్యం సాధించాలని అన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా ప్రథమ సంవత్సరం ఎంబీఏ విద్యార్థినులు కుమారి, రాగప్రియ, భువనేశ్వరి, లావణ్య, ద్వితీయ విజేతలుగా బిబిఎ విద్యార్థినులు గీతామాధురి, ఆశ్రితాదేవి నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.            

  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us