UPDATED 27th JANUARY 2018 SATURDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించిన ఎసిటి (ఆదిత్య క్రికెట్ టోర్నమెంట్) పోటీలలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తృతీయ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు విజేతలుగా, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం మెకానికల్ విద్యార్థులు రన్నర్స్ గా నిలిచారని ఆదిత్యా విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసానికి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఫిజికల్ డిపార్ట్ మెంట్ విభాగ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తదితరులు క్రీడాకారులను అభినందించారు.







