శాకాంబరిదేవిగా మరిడమ్మ

పెద్దాపురం, 6 ఆగష్టు 2021 (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారు శాకాంబరీ దేవిగా శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పలు రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా పచ్చని కూరగాయలతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. వర్షాకాలం ప్రారంభమైన తరువాత కూరగాయలను అమ్మవారికి నివేదించడం ద్వారా రైతులకు ఫలసాయం బాగా వచ్చి లోకమంతా సుభిక్షంగా ఉంటుందని, శాకాంబరిగా అమ్మవారిని దర్శించుకుంటే ఆహారానికి ఎటువంటి లోటుండదని పండితులు వివరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us