విజయనగరం (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి. పద్మావతి 'మిసెస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ (ఎన్. జీ.ఓ) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆన్ లైన్ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు. 2021 సెప్టెంబరులో జరిగిన ప్రాథమిక పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వంద మంది యువతులు ఎంపిక కాగా వీరిలో 36 మంది అర్హత సాధించారు. ఈ నెల 16న నిర్వహించిన తుది పోటీల్లో మంచి ప్రతిభ చూపిన పద్మావతి 'మిసెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో విశాఖపట్నంలో నిర్వహించిన శ్రీమతి వైజాగ్ పోటీల్లోనూ ఈమె ఫైనల్‌కు అర్హత సాధించినప్పటికీ కొవిడ్ కారణంగా పాల్గొనలేకపోయారు. వివాహం అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఈమె తండ్రి రామకృష్ణ గరివిడిలోని ఫేకర్ పరిశ్రమలో సెక్యూరిటీ చీఫ్ గా పనిచేస్తున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







