జిల్లాలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

UPDATED 8th JUNE 2020 MONDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. మల్లికార్జున్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా​ వచ్చి ఈ కేంద్రాలలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
పట్టణ ప్రాంతాల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాలు:
కాకినాడ: ముత్తానగర్, సంజయ్ నగర్, ఏటిమొగ -1 యూపిహెచ్ సీలు,
రాజమహేంద్రవరం: ఈశ్వరనగర్, నారాయణపురం, బృహన్నలపేట, శంభునగర్ యూపిహెచ్ సీలు,
మండపేట: పెదహరిజనపేట యూపిహెచ్ సీ,
సామర్లకోట: పాత్రులపేట యూపిహెచ్ సీ,
తుని, అమలాపురం, పెద్దాపురం, రామచంద్రపురం: ఏరియా ఆసుపత్రులు.
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాలు:
కాకినాడ డివిజన్: పిఠాపురం సిహెచ్ సీ, కరప, యూ.కొత్తపల్లి, వేట్లపాలెం పిహెచ్ సీలు, కాకినాడ ఎస్ఆర్ఎంటి హెల్త్ సెంటర్
పెద్దాపురం డివిజన్: ఏలేశ్వరం సిహెచ్ సీ, రంగంపేట, పులిమేరు, రాచపల్లి, రావికంపాడు, శంఖవరం, కోటనందూరు పిహెచ్ సీలు
రామచంద్రపురం డివిజన్: మండపేట సిహెచ్ సీ, బిక్కవోలు, ద్రాక్షారామ, రాయవరం పిహెచ్ సీలు
రాజమహేంద్రవరం డివిజన్: కోరుకొండ, రాజానగరం, డి. కేశవరం, సీతానగరం పిహెచ్ సీలు
అమలాపురం డివిజన్: ముమ్మిడివరం, గన్నవరం సిహెచ్ సీలు, అవిడి, ఊబలంక, తాటిపాక, కాట్రేనికోన, లక్కవరం, గోడిలంక పిహెచ్ సీలు, మురమళ్ళ సబ్-సెంటర్, 
రంపచోడవరం డివిజన్: రంపచోడవరం ఏరియా ఆసుపత్రి, అడ్డతీగల, వై.రామవరం సిహెచ్ సీలు, దేవీపట్నం, మారేడుమిల్లి, ఇందుకూరిపేట పిహెచ్ సీలు
ఎటపాక డివిజన్: రేఖపల్లి, ఎదుగులపల్లి, నెల్లిపాక, తులసిపాక పిహెచ్ సీలు

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us