స్పందన కార్యక్రమానికి 15 అర్జీలు

UPDATED 22nd JULY 2019 MONDAY 5:30 PM

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 15 అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. వీటిలో మున్సిపల్ కుళాయి కనెక్షన్ సమస్యలపై రెండు, వెబ్ ల్యాండ్ లో తప్పుగా నమోదైన భూమి వివరాలను సరి చేయమని రెండు, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి రెండు, తెల్లరేషన్ కార్డును అన్నపూర్ణ అంత్యోదయ కార్డుగా మార్చమని ఒకటి, స్కూల్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇప్పించమని ఒకటి, విఆర్ఎ ఉద్యోగం కోసం ఒకటి, 22ఎ భూమి తీసివేయమని ఒకటి, పింఛన్ కోసం ఒకటి, మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉచిత దర్శనం ఏర్పాటు చేయమని ఒకటి, ఏఎన్ఎం ఉద్యోగానికి సంబంధించి నిబంధనలు మార్పు చేయమని ఒకటి, వయస్సు తగ్గించమని ఒకటి, పేదలకు ఇళ్ల స్థలాలు యిప్పించమని ఒకటి అర్జీలు వచ్చాయని, ఈ అర్జీల పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపినట్లు ఆర్డీవో తెలిపారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us