UPDATED 22nd JULY 2019 MONDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2 యూనిట్లు పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేకరించిన సుమారు ఐదు వందల కిలోల పాత వార్తా పత్రికలు, నోట్ పుస్తకాలను సోమవారం ఐ.ఆర్.డి.ఏ సంస్థకు అప్పగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జె.ఎన్.టి.యు (కాకినాడ)కు చెందిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. వెంకటరెడ్డి, ఐ.ఆర్.డి.ఏ (అమరావతి) అధ్యక్షులు పి. వినయ్ కుమార్, ఐ.ఆర్.డి.ఏ కో- ఆర్డినేటర్ జి. సంబిరెడ్డి, పర్యావరణవేత్తలు కె. వీరబ్రహ్మం, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. సమాజ హితమే ఎన్ఎస్ఎస్ పరమావధి కావాలని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందు తమకు తాము సేవకు సిద్దమైనప్పుడే యువతకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేయగలరని అన్నారు. రీసైక్లింగ్ విధానం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని, ఒక టన్ను కాగితం తయారీకి 50 సంవత్సరాల వయసుగల సుమారు 17చెట్లను నరికి వేయవలసి వస్తుందని, ఒక చెట్టు టన్ను ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు జ్ఞానవర్జిన్, శివకుమార్, భాస్కర్, కార్తీక్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







