ఘనంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం

UPDATED 6th JULY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పశువుల ఆసుపత్రి వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ హాజరై యాంటీ రేబిస్ వాక్సిన్ ను విడుదల చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువుల నుంచి మనుష్యులకు సంక్రమించే వ్యాధుల గురించి వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. మనోజ్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం. విజయభాస్కర్, కార్యదర్శి రావి అప్పారావు, కోశాధికారి నితిన్ జైన్ లోధ్ర, మెంబర్లు ఆదినారాయణరెడ్డి, గుండు శంకర్రావు, మేకా శ్రీనివాస్, సేపేని సురేష్, ఉబేదుల్లా, ఈశ్వరకుమార్, నేతి బాబ్జీ, కటకం గంగబాబు, సింగవరపు సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us