UPDATED 26th SEPTEMBER 2017 TUESDAY 4:00 PM
పెద్దాపురం: స్థానిక పట్టణ పరిధిలో కట్టమూరుపుంతలో ఉన్న కల్వరి మిరాకిల్ చర్చ్ గ్రౌండ్ లో వాటర్ ఫర్ థి వరల్డ్ ఎన్ ఎల్ ఏ ఇండియా బయో సాండ్ వాటర్ ఫిల్టర్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన తాగునీటిని అందచేసేందుకు మిషనరీ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, కౌన్సిలర్ శెట్టి శ్రీనువాసు, సుబ్బలక్ష్మి, నేషనల్ డైరెక్టర్ రెవరెండ్ ఖండవల్లి యోహాన్, కోఆర్డినేటర్ రెవరెండ్ పురుషోత్తందాస్ లంక, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.







