గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021 : మండలంలోని బయ్యనపల్లి పంచాయతీలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమం అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈసమావేశంలో చర్చించారు. ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజల డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలి అని, నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అర్హులైన వారికి సామాజిక పింఛన్లు వెంటనే ఇవ్వాలని, విద్యుత్ బిల్లు తగ్గించాలి అని, పాడైన రహదారులను నిర్మించాలని, వీధి దీపాలు వెలగడం లేదని, మంచి నీళ్లు చాలా ఇబ్బంది అని నీరు దొరకడం లేద అని, డ్రైనేజీ సమస్య చాలా ఇబ్బందిగా ఉందని సమస్యలక్ను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఎంపీటీసీ పండా అదినారాయణ , ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ , బొట్టా కృష్ణ గ్రామకమిటీ అధ్యక్షులు పామర్తి వీరబాబు ,బండి చిన్న వెంకటరమణ, సింహాద్రి, రాంబాబు నూతనప్రసాద్, కొంజర్ల సత్యనారాయణ, కొండ బాబు, పోలుజు కృష్ణ , టేకుమూడి వెంకట రమణ, కానెం బేబీ ,దుర్గారావు కంగల జగ్గారావు, నాగన్న పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







