అధ్యాపకులు నిరంతరం పరిశోధనలు చేయాలి

UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 8:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలను సింగపూర్ కు చెందిన నాన్యాంగ్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, శాంతస్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కార గ్రహీత ఉపద్రుష్ట రామ్మూర్తి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధ్యాపకుడు నిరంతర విద్యార్ధని, అందుకే అధ్యాపకులు నిరంతరం పరిశోధనలు చేయాలనీ సూచించారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసేవిధంగా, సమాజానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై పరిశోధనలు చేపట్టేవిధంగా ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. గైట్ కళాశాల తరఫున ఆచార్య ఉపద్రుష్ట రామ్మూర్తిని దుశ్శాలువతో  ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, డాక్టర్ డి.వి. రాంమూర్తి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, డీన్లు, తదితరులు పాల్గొన్నారు.       

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us