UPDATED 30TH OCTOBER 2017 MONDAY 10:00 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో భవానీ శంకర అష్టలింగేశ్వరస్వామికి ఏకవార రుద్రాభిషేకం, అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్తీక శుద్ధ దశమిని పురస్కరించుకుని పీఠంలో అమ్మవారి పాద ముద్రికలు వెలసిన రోజు సందర్భంగా శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామికి సుప్రభాతసేవ, తులసీదళఅర్చన, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పుష్పార్చన, భవానీశంకర సమేత అష్టలింగేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన కుంకుమార్చనలు, నీరాజన మంత్రపుష్పం, మహా నివేదన వంటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్( బాబి), వేదపండితులు చీమలకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







