సైనిక దాడికి త‌క్ష‌ణమే స్వ‌స్తి పలకండి: పుతిన్ ను కోరిన ప్రధాని మోదీ

UPDATED 25 FEBRUARY 2022 FRIDAY 12:05 AM

Modi Speaks Putin : రష్యా-యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. యుక్రెయిన్‌పై సైనిక దాడికి త‌క్ష‌ణమే స్వ‌స్తి పలకాల‌ని పుతిన్ ను కోరారు. హింస‌కు తెర దించాల‌ని పుతిన్ ను అభ్య‌ర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని పుతిన్‌కు సూచించారు. అదే విధంగా యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

కాగా, తొలి నుంచి భార‌త్‌కు ర‌ష్యా మిత్ర‌దేశంగా ఉంది. రష్యాతో భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో త‌క్ష‌ణం యుద్ధాన్ని నిలిపేయాల‌ని పుతిన్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కోర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప్రధాని మోదీ అభ్యర్థనకు పుతిన్ ఓకే చెబుతారా? యుద్ధం ఆపేస్తారా? ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? అని ప్రపంచ దేశాలు ఆత్రుతగా వేచి చూస్తున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us