గైట్ ఈఈఈ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సమావేశం ప్రారంభం

UPDATED 23rd MARCH 2018 FRIDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) అటానమస్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటింగ్ విద్యుత్ ఎలక్ట్రానిక్స్, స్థిరమైన శక్తి వ్యవస్థలపై మూడవ అంతర్జాతీయ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. సదస్సు కన్వీనర్, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ డి. రవికిషోర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభకు ఓ.ఎన్.జి.సి డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. దేవకుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి మాట్లాడారు. సాంప్రదాయ ఇంధన వనరులు వినియోగంపై దృష్టి సారించి విస్తృతంగా పరిశోధనలు చేయాలని విద్యార్థినీ, విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడుస్తున్న వాహనాలు స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు మనదేశంలో రానున్నాయని, 2030 సంవత్సరం నాటికి భారతదేశ రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతాయన్నారు. తాము చదువుకున్న రోజులతో పోల్చి చూస్తే ప్రస్తుతం సాంకేతికపరంగా వేగవంతమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. సాంకేతికపరంగా ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని కోరారు. భారతదేశంలో పవన విద్యుత్ కొన్ని ప్రాంతాలలో వినియోగంలో ఉందన్నారు. ఓ.ఎన్.జి.సి లో జరుగుతున్న కార్యక్రమాలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడే విధానాన్ని వివరించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ రవికిషోర్ మాట్లాడుతూ భావి ఇంజినీర్ల విజ్ఞాన మార్పిడికి వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, 2016 సంవత్సరం నుంచి ఈఈఈ విభాగం  ఈ జాతీయ సదస్సులు నిర్వహణ ప్రారంభించిందని అన్నారు. రెండురోజుల పాటు ఈ జాతీయ సదస్సు  జరుగుతుందని, వివిధ సాంకేతిక అంశాలపై చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రొసీడింగ్స్ పుస్తకాన్ని, సీడీని ముఖ్యఅతిథి దేవకుమార్ ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి దేవకుమార్ ను కళాశాల తరఫున ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్స్ పి.వి.జి.కె. జగన్నాధ రాజు, ఎస్. మూర్తి, డైరెక్టర్లు డాక్టర్ ఎల్.ఎస్. గుప్త, పి.ఆర్.కె.రాజు, అకడమిక్ డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, డీన్ ఆఫ్ అఫిలియేషన్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us