UPDATED 30th JUNE 2019 SUNDAY 8:00 PM
పెద్దాపురం: నియోజకవర్గ ప్రజల వినోదానికి, ఆరోగ్యానికి ఆహ్లాదకరం కలిగించేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే రహదారిలో రూ. ఒక కోటి 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్, వాటర్ ఫౌంటెన్ ను ఆయన ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ రూ. 84 లక్షలతో మున్సిపల్ పార్కు, రూ. 21 లక్షలతో వాటర్ ఫౌంటెన్, రూ.10 లక్షలతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల అభీష్టం మేరకు నియోజక వర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







