ఆండాళ్ భజన కోలాట భక్త సమాజం ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ

UPDATED 6th MARCH 2018 TUESDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామంలో ఆండాళ్ భజన కోలాట భక్త సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రామానికి చెందిన 43 మంది కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకుని మంగళవారం గ్రామానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా  ఆండాళ్ భజన కోలాట భక్త సమాజం నాయకులు వారికి పౌష్టికాహారం, మందులు పంపిణీ చేశారు. అనంతరం సమాజం సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us