UPDATED 21st FEBRUARY 2018 WEDNESDAY 8:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బ్యాచలర్ ఆఫ్ సైన్స్ అధిపతి ప్రొఫెసర్ బి.ఎస్.ఎన్.మూర్తి కాకినాడ జె.ఎన్.టి.యు నుంచి పి.హెచ్.డి పట్టా డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ సంస్థలో గత పది సంవత్సరాలుగా బి.ఎస్.ఈ విభాగం ప్రొఫెసర్ గా అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని, మాథమెటికల్ మోడలింగ్ ఇన్ ఇకాలజీ సబ్జెక్టుపై ఆయన సమర్పించిన "స్టడీ ఆఫ్ ది డైనమికల్ బిహేవియర్ ఆఫ్ సెర్టైన్ నాన్ లీనియర్ బయో మాథమెటికల్ మోడల్స్" థీసిస్ కు డాక్టరేట్ లభించినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బి.ఎస్.ఎన్.మూర్తి ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ అండ్ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణారావు, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు అభినందించారు.







