UPDATED 27th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రంజిత్ ఓఫిర్ 39వ దినోత్సవ సందర్భంగా ఆర్.కె.పి. యూత్ సంఘం సభ్యులు మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ ఔట్ పోస్టు దగ్గర వంద లీటర్ల మజ్జిగను ట్రాఫిక్ ఏఎస్ఐ సత్యన్నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేశవరపు రామ్మోహన్ రావు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు కాశీ బాలయ్య, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ప్రెసిడెంట్ రామకృష్ణ , క్రైస్తవ పరిషత్ యూత్, సభ్యులు పాల్గొన్నారు.







