UPDATED 25th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: పట్టణాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నగరదర్శని-నగరవికాసం కార్యక్రమంలో భాగంగా మంత్రి స్థానిక 24వ వార్డు బలుసువారి వీధి, కొత్తూరులో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ వార్డులోని సిసి రోడ్లు, కాలువలను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, వార్డు కౌన్సిలర్ వట్టికూటి గోపాలరావు, బడుగు శ్రీకాంత్, నిమ్మ ఫణికుమార్, శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







