బకాయిదారులపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి

UPDATED 29th JUNE 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: మున్సిపల్ షాపింగ్ షాపుల బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం బకాయిదారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. మునిసిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అజెండాలోని పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద గల దుకాణ సముదాయం లో ఓ షాపుకి సంబంధించి రూ. రెండు లక్షలకుపైగా బకాయి ఉందని, అలాగే స్టేషన్ సెంటర్ లో రెండు షాపులు కలిపి రూ. ఐదు లక్షలు వరకు బకాయి ఉందని, శనివారం సాయంత్రంలోగా బకాయిదారులు ఈ బకాయిలు చెల్లించకపోతే లీజు రద్దు చేసి వేలం నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. దీనిపై కౌన్సిలర్లు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు. దుకాణ సముదాయాలు అద్దెలను నెలనెలా వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సమగ్రమైన చర్యలు చేపట్టాలని సీనియర్ కౌన్సిలర్  మన్యం చంద్రరావు సూచించారు. జీరో అవర్ లో  కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతీ వార్డులో కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయని తక్షణం చర్యలు తీసుకోవాలని, అలాగే సామర్లకోట నుంచి పెద్దాపురం రహదారి నిర్మాణ పనుల్లో ఒకవైపు ఇనుప ఊసలు బయటకు వచ్చాయని, దీని వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే కౌన్సిలర్లు ఊబా జాన్ మోజస్, కాళ్ళ లక్ష్మినారాయణ పలు అంశాలను లేవనెత్తగా మున్సిపల్ అధికారులు వాటికి వివరణ ఇచ్చారు. ఈ కౌన్సిల్ సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us