UPDATED 31st JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక తోట గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ కౌన్సిలర్ సి.హెచ్. వెంకటేశ్వరావుకు మంగళవారం వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తోట గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, తక్షణం ఉపాధ్యాయులను నియమించాలన్నారు.







