‘లెనోరా'లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

UPDATED 7th APRIL 2018 SATURDAY 9:00 PM

రాజానగరం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల ప్రజా వైద్య విభాగం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా దంత పరిక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. దీనిలో భాగంగా గోకవరం మండలం తంటికొండలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ  కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాశ్ శెట్టి, వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, పి.జి. డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణరావు, వివిధ విభాగాల  అధిపతులు,  ప్రజా దంత వైద్య విభాగం డాక్టర్లు కమల్ షా, టి. రవికుమార్, పిఆర్వోలు రాంబాబు, కుమార్, తంటికొండ వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర, దేవాలయ కార్యనిర్వహణాధికారి  బి. రామారావు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us