వైభవంగా కుమారరామ భీమేశ్వరస్వామి రధోత్సవం

UPDATED 14TH fFEBRUARY 2018 WEDNESDAY 9:30 PM 

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి రధోత్సవం అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు. ఈ రధోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముందుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మధ్యాహ్నం 1.45 నుంచి స్థానిక గాంధీబొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమై మఠం సెంటర్ మీదుగా భారీ ఊరేగింపుగా ఈ రధోత్సవం బయలుదేరింది. అలాగే ఈ రథోత్సవంలో వివిధ రకాల గారడీ, కోలాటం,తీన్మార్, బ్యాండ్, శివనాట్యం, కాళికాదేవీ నృత్య ప్రదర్శనలు, డప్పులడ్యాన్స్, పురాణ పురుషుల వేషాధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సమాజంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని, దైవచింతనతోనే సంతృప్తి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, కుంచే బాబు, ఈవో పులి నారాయణమూర్తి, దేవస్థానం పాలక మండలి సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.    
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us