UPDATED 6th MARCH 2020 FRIDAY 8:00 PM
రాజానగరం(రెడ్ బీ న్యూస్): రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో లెనోరా దంత కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. వెలుగుబంద గ్రామ పంచాయతీ సౌజన్యంతో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో లెనోరా దంత వైద్య కళాశాలకు చెందిన వైద్య బృందం గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి దంతాల సంరక్షణపై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అఖిల్, డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ సంధ్య, పాఠశాల హెచ్ఎం కుమార్, తదితరులు పాల్గొన్నారు.







