పంటలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి

* మండల వ్యవయాధికారిణి  ఐ. సత్య

UPDATED 6th JANUARY 2020 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) :ప్రతీ రైతు తాను సాగుచేస్తున్న పంటను ఆన్ లైన్ విధానంలో నమోదు చేయించుకోవాలని మండల వ్యవయాధికారిణి ఐ. సత్య పేర్కొన్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో ఈ-కర్షక్ లో పంటల వివరాలు నమోదుపై సోమవారం రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేని విధానాన్ని అమలు తెచ్చిందని, ఇందులో భాగంగా రైతులు పంటల బీమా పరిధిలోకి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఈ-కర్షక్‌ యాప్‌ను అమల్లోకి తెచ్చిందని అన్నారు. పంటల బీమా కోసం రైతులు గ్రామ సచివాలయాలలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ సహాయకులు పంటల సాగు, రైతుల వివరాలను ఈ-కర్షక్‌ యాప్‌లో నమోదు చేస్తారన్నారు. ఆన్ లైన్ విధానంలో పంటలు నమోదు చేయించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల సదుపాయాలు రైతులు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు బి. సతీష్, ఎ. భవిత, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us