జనం మెచ్చే పాలన జనసేనతోనే సాధ్యం

UPDATED 8th APRIL 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: జనం మెచ్చే పాలన జనసేన పార్టీతోనే సాధ్యం అవుతుందని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రారంభమై స్టేషన్ సెంటర్ మీదుగా ఉండూరు, కాపవరం, చంద్రపాలెం, నవర, తదితర గ్రామాలతో పాటు పెద్దాపురం మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మల రామస్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపడితేనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, అలాగే యువతకు ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు. కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ అని, పేదల సమస్యలకు జనసేన, మిత్రపక్షాల కూటమితోనే పరిష్కారం లభిస్తుందన్నారు. పేదల జీవితాలను మార్చాలనే ఉన్నత ఆశయాలతో, విలువలతో కూడిన సిద్ధాంతాలతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. జనసేన పార్టీ  అధికారంలోకి వస్తే పవన్‌ కళ్యాణ్‌ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని వెంటనే అమలు చేయడం జరుగుతుందని ప్రకటించారు. నిరంతరం  ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తమ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us