UPDATED 2nd JANUARY 2020 THURSDAY 6:30 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ద్వితీయ సంవత్సరం బిబిఏ చదువుచున్న విద్యార్థులు ఎస్. సాయి చరణ్, ఎం.వి.వి. సాయితేజ, ఎన్. సునీల్ ఇటీవల ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమహేంద్రవరం) ప్రస్థానం -2కె19 పేరిట నిర్వహించిన మేనేజ్ మెంట్ ఫెస్ట్ ఫైనాన్స్ విభాగంలో బుల్స్ vs బేర్స్ లో ప్రథమ బహుమతి గెలుపొందినట్లు డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి తెలిపారు. అలాగే ఆదిత్య డిగ్రీ కళాశాల (కాకినాడ) “కన్ఫ్లుయెన్స్-2కె19” పేరిట నిర్వహించిన బి.క్విజ్ విభాగంలోనూ సత్తా చాటి ప్రథమ బహుమతులు గెలిపొందారని తెలిపారు. మేనేజ్ మెంట్ విభాగంలో ప్లేస్ ఏదైనా ఫలితం ప్రథమ స్థానం మాదే అంటూ తమ విద్యార్థులు ఈ ఈవెంట్లలో గొప్ప ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతులు గెలుపొందడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ తమ విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలకే పరిమితం చేయకుండా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ అన్నిరంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అందుకే అన్నిరంగాలలో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరుస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజేతలను డైరెక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, తదితరులు అభినందించారు.







