గైట్ లో మేధ సాంకేతిక విద్యా ఉత్సవం

UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 8:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ నుంచి సాంకేతిక విద్యా ఉత్సవం"మేధ"ను నిర్వహిస్తున్నట్లు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తెలిపారు. ఈ మేరకు కళాశాలలో మంగళవారం మేధ సాంకేతిక విద్యా ఉత్సవం పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇంజనీర్స్ డే సందర్భంగా రెండురోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రతీ ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా మేధకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గైట్ కళాశాల ప్రాంగణంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలు మేధ సందర్భంగా రోబోరేస్, ప్రాజెక్ట్ ఎక్స్పో, ఐడియా థాన్, ఇంటరాక్టీవ్ వెబ్ డిజైనింగ్, స్పాట్ ఈవెంట్స్, యాప్ డవలప్ మెంట్ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. భారతదేశానికి చెందిన మొట్టమొదటి రెస్ట్రో రీజన్ ఫ్యూషన్ బ్యాండ్ క్యాప్రికో రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు www.giet.ac.in /medha ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా  సంస్థల సిఇవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి, డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, మేధ కన్వీనర్ డాక్టర్ బి. సుజాత, కో-కన్వీనర్ వి. సుబ్రహ్మణ్యం, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ జి. శైలేంద్ర, తదితరులు పాల్గొన్నారు.              

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us