UPDATED 12 th APRIL 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక సంత మార్కెట్ సమీపంలో ఉన్న పప్పుల నుంచి నూనె తీసే షాపు పరిమితి మించి సరుకులు నిల్వ ఉందని సమాచారం అందడంతో దాడులు నిర్వహించి షాపు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు కాకినాడ డివిజన్ సివిల్ సప్లై ఎఎవో సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల వ్యాపారులు తహసిల్దార్, సివిల్ సప్లై అధికారుల నుంచి విధిగా లైసెన్స్ పొందాలని, అయితే షాపు యజమాని తహసీల్దార్ నుంచి లైసెన్స్ ఉందని తెలిపినప్పటికీ, పరిమితికి మించి ఎక్కువ మోతాదులో నిల్వలు ఉండడంతో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎం.ఎస్.వో ఎం. సూరిబాబు, సుబ్బారావు, విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







