UPDATED 18th DECEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరాలు ఉండొచ్చని, 5'5 ఎత్తు, చామనచాయ రంగులో, నలుపు రంగు ఫ్యాంట్, తెలుపురంగుపై నలుపు గీతల షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు.







