రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికలు

UPDATED 3rd OCTOBER 2017 FRIDAY 9:00 PM

సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి తాతబ్బాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రతిభ విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్థానిక ప్రతిభ విద్యానికేతన్ వద్ద ఆంధ్రప్రదేశ్ 63వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల జూడో ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తారన్నారు.19 సంవత్సరాల లోపు విభాగాల్లో బాలురు, బాలికలు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. పోటీలకు వచ్చే బాలురకు బచ్చుఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో, బాలికలకు ప్రతిభ విద్యానికేతన్లో వసతి కల్పిస్తారన్నారు. ఈ సమావేశంలో ప్రతిభా విద్యానికేతన్ కరస్పాండెంట్ ప్రకాష్, అకడమిక్ డైరెక్టర్ రవికుమార్, అబ్జర్వర్ రత్నశామ్యుల్, డీఎస్ఏ కోచ్ శేషగిరావు, రమణ పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us