ఆదిత్యలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్ షాప్

UPDATED 22nd DECEMBER 2017 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలు మెకానికల్ విభాగం సంయుక్త సౌజన్యంతో ఎక్స్ పెరిమెంటల్ టెక్నిక్స్ ఇన్ వెల్డింగ్ టెక్నాలజీ పేరిట రెండురోజులు పాటు జరగనున్న జాతీయస్థాయి వర్క్ షాప్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ వర్క్ షాప్ ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ టి. శ్రీహరి పర్యవేక్షణలో రాష్ట్రంలో గల వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతరం నేర్చుకొంటూ ఉన్నప్పుడే విద్యార్థులకు పరిపూర్ణమైన జ్ఞానం అందించగలరని, మంచి శ్రోత అయినప్పుడే మంచి వక్తగా ప్రావీణ్యం పొందగలరన్నారు. నేటి సమాజంలో, మంచి వక్త కావడానికి ఆసక్తి చూపుతున్నారు తప్ప మంచి శ్రోతగా వినే సహనం ఉండడం లేదన్నారు. తెలియని విషయాలు నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిచగలరని అందుకే ఇటువంటి వర్క్ షాపులు ప్రతీ విభాగంలోనూ తరచూ నిర్వహించాలని ఆయన సూచించారు. అధ్యాపక వృత్తి ఎంతో భాద్యతాయుతమైనదని, సమాజ నిర్మాణం అధ్యాపకుల చేతుల్లో ఉంటుందన్నారు. వేగంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని అధ్యాపకులు సాగినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలరన్నారు. ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ టి. శ్రీహరి మాట్లాడుతూ 17 సంవత్సరాలు పైబడి అధ్యాపక వృత్తి అనుభవంతో అనేక జాతీయస్థాయి వర్క్ షాపులు నిర్వహించిన పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న ల్యాబ్ పరికరాలతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఏ విధంగా చేయగలమో ఈ వర్క్ షాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us