విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదు

UPDATED 19th JULY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: విధి నిర్వహణలో పారిశుధ్య కార్మికులు అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. స్థానిక మెప్మా కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామర్లకోట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు కృషి చేయాలని అన్నారు. పట్టణ పరిధిలోని వార్డులలోని ఇంటింటా తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తాను వార్డుల్లో ఆకస్మికంగా పర్యటిస్తానని, ఎవరికి కేటాయించిన వార్డుల్లో వారు సక్రమంగా విధులు నిర్వహించాలని అన్నారు. అంతకుముందు పాత్రికేయుల సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ పట్టణానికి సంబంధించి పూర్తిస్థాయిలో లైటింగ్, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్, హెల్త్ అసిస్టెంట్ పొడుగు చిట్టిబాబు, సిబ్బంది కొండబాబు, గూడుపు శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us