జీడిమామిడి సాగులో యాజమాన్య పద్ధతులపై శిక్షణ

UPDATED 15th OCTOBER 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): జీడిమామిడి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకంలో భాగంగా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సంయుక్తంగా కృషి విజ్ఞాన కేంద్రం (పందిరిమామిడి) ఆధ్వర్యంలో స్థానిక టిటిడిసిలో జీడిమామిడి సాగులో మేలైన యాజమాన్య పద్దతులపై రైతులకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ జీడిమామిడి ముదురు తోటల వలన ఉత్పాదకత తగ్గుతుందని, అధిక దిగుబడినిచ్చే మేలైన జీడిమామిడి అంటు మొక్కలను నాటుకోవాలని అన్నారు. అలాగే జీడిపిక్క, జీడిపప్పు నుంచి జీడీ ఆయిల్ విలువ ఆధారిత పదార్థాలుగా మార్చి ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. సీనియర్ శాస్త్రవేత్త వి. లలితా కామేశ్వరి మాట్లాడుతూ ఈ జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దానిని క్షేత్రస్థాయిలో పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డాక్టర్  ఆదర్ష్, పి. రాజశేఖర్, కె.సి. భానుమూర్తి, పి. చిన శ్రీనివాసరావు, సీనియర్ శాస్త్రవేత్త కె. రాజేంద్ర ప్రసాద్, డిపిఎం, ఏపిఓ సుజాత, ఉద్యాన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us