గైట్ కళాశాలలో అధ్యాపక అభివృద్ధి శిక్షణ ప్రారంభం

UPDATED 4th JUNE 2018 MONDAY 9:00 PM

రాజానగరం: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు అధ్యాపక అభివృద్ధి శిక్షణా కార్యక్రమం (Faculty development programme) స్థానిక గైట్ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న 53 మంది అధ్యాపకులు ఈ శిక్షణా కార్యక్రమానికి హజరయ్యారని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, రిసోర్స్ పర్సన్ డాక్టర్ పి. గోవర్ధన్ రామానుజం తెలిపారు. చెన్నైకు చెందిన ఎన్ఐటిటిఆర్  ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ సి.ఆర్. నాగేంద్రరావు మాట్లాడుతూ అధ్యాపకులంతా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధ్యాపక నైపుణ్యాలు, లెసన్ ప్లానింగ్, స్టూడెంట్స్ ఈవాల్యూయేషన్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, తదితర అంశాలను ఈ శిక్షణలో బోధించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణకు హాజరైన 53 మందిలో 13 మంది గైట్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఈడిఐ మీడియా, టెక్నాలజీ ప్రొఫెసర్ ఆరోఖ్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us