UPDATED 3rd JANUARY 2019 THURSDAY 9:00 PM
పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గాన్ని ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని ఆర్.బి.కొత్తూరు, చినబ్రహ్మదేవం, ఆర్.బి.పట్నం గ్రామాల్లో గురువారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, శ్మశాన వాటికల అభివృద్ధి, సామాజిక భవనాల నిర్మాణాలు, అంగన్‌వాడీ, పంచాయతీ కార్యాలయ భవానాలు, ఎల్‌ఈడీ లైట్లు, మరుగుదొడ్లు, చెరువులు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. చంద్రన్న భీమా పధకం ద్వారా నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నామని, అలాగే గర్భిణులకు ఉచితంగా పౌష్టికాహరం అందజేస్తున్నామని అన్నారు. ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి పనిముట్లు అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సామూహిక సీమంతాలు నిర్వహించి పౌష్టికాహారం కిట్లు, సంక్రాంతి కానుకలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, ఎంపిడివో పి. వసంతమాధవి, ఎంపిపి గుడాల రమేష్, జెడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఎంపిటిసి కల్తూరి శ్రీనివాస్, ఈవోపిఆర్డీ కరక హిమమహేశ్వరి, సిడిపివో ఆదుర్తి విజయలక్ష్మి, ఏవో కొల్లి ద్వారకాదేవి, తదితరులు పాల్గొన్నారు.







