UPDATED 24th APRIL 2018 TUESDAY 7:00 PM
సామర్లకోట: స్థానిక ఎస్.ఆర్.సి లాడ్జిలో ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాతపూడి కృష్ణబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల మూడవ తేదీన జరుగు ఎస్సీ, ఎస్టీ రైతుల సన్నాహక సభను రాజమండ్రిలో విజయవంతం చేయాలని, అలాగే వచ్చేనెల 27వ తేదీన వరంగల్ లో జరిగే దళిత, గిరిజన సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, పట్టణ దళితులు ఐక్యంగా తరలి రావాలని, అలాగే కమిటీలు నిర్వహించి సభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు జి.వి. రాఘవ మాస్టారు, లింగం శివప్రసాద్, వల్లూరి నాని, కొల్లి చైతన్య కుమార్, నందిక చక్రం, నీలం నాగేంద్రప్రసాద్, మందపల్లి వెంకన్న, గోరింట అప్పారావు, గొప్పులు రామకృష్ణ, మందపల్లి సంజయ్, గోడల శాంతి ప్రసాద్, మార్త రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







