UPDATED 18th NOVEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ నియోజకవర్గ నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ప్రతీ ఒక్క కార్యకర్త జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాపోరాట యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రతీ నియోజకవర్గంలో నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలాగే ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల బాబు, సరోజ్ వాసు, ఉదయ్ కుమార్, మహ్మద్ షఫీయుల్లా, పబ్బినీడి ఈశ్వరరావు, పబ్బినీడి చక్రరావు, బండే నాగేశ్వరరావు, వీరంశెట్టి సత్తిబాబు, బండే చంద్రరావు, ఎండి శ్రీను, తుమ్మల సూరిబాబు, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







