UPDATED 6th JUNE 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: నిరుపేదలను అన్నివిధాలా ఆదుకునేందుకే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేస్తున్నట్లు హుస్సేన్ పురం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి అన్నారు. స్థానిక రైల్వే కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుస్సేన్ పురం గ్రామానికి చెందిన పలువురికి ఆయన చేతుల మీదుగా బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం బుజ్జి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం పింఛన్లు ఐదు రెట్లు పెంచి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని, అలాగే తమ గ్రామంలో చాలా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హయాంలో రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ సెంటర్ రావడంతో తమ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.







