ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి

UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బిఎల్ వోలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ ఓటు హక్కు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. 2019 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చన్నారు. అర్హత కలిగిన వారు ఓటు హక్కు పొందడమే కాకుండా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా నిజాయతీపరులను ఎన్నుకోవాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, వంద శాతం తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేసేందుకు ప్రజా ప్రతినిధులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా చేరాలని వారిని ఓటర్లుగా గుర్తించే బాధ్యత బిఎల్ వోలు తీసుకోవాలని అన్నారు. బిఎల్ వోల వద్ద వార్డులకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని, అలాగే వార్డులలోని ప్రజల వద్దకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు ఆధారంగా ఈ వివరాలు సేకరించడం వలన 18 సంవత్సరాలు వయస్సు కలిగిన వారిని గుర్తించడం సులభమవుతుందని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి బ్రౌన్ పేట సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల  హెచ్ఎం  యు.సత్యనారాయణ, ఆర్. శ్రీనివాసరాజు, టి. శ్యామ్ సుందర్, వైఆర్ఎల్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us