UPDATED 8th JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రాభివృద్ధికి ప్రజలందరూ నవ నిర్మాతలు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నవ నిర్మాణ దీక్ష ఏడవ రోజైన శుక్రవారం మహాసంకల్పం ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పద్మావతి మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఏడు రోజులు ఒక్కొక్క అంశంపై అభివృద్ధి, పురోగతిపై చర్చిండం జరిగిందని, నాలుగేళ్లలో ఆర్థికలోటు ఉన్నా ముఖ్యమంత్రి పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని లోటు లేకుండా నడిపిస్తున్నారని చెప్పారు. వారం రోజుల నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా గ్రామగ్రామానా, పట్టణాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంపై ప్రజలు మరింత విశ్వాసాన్ని చూపారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు ప్రభుత్వ పథకాలు, పట్టణలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ డి. ప్రభాకరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, వైకుంఠం, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, సిడిపివో టి.డి.ఆర్. పద్మావతి, మెప్మా సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







